Rohit Sharma: ‘రోహిత్ ఫామ్‌లోకి వస్తే భారత్‌ను మించిన బలమైన జట్టు ఉండదు’
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) తిరిగి ఫామ్‌లోకి వస్తాడని, అతడు ఫామ్‌లోకి వస్తే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను మించిన బలమైన జట్టు ఉండదని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ((Irfan Pathan) అభిప్రాయపడ్డాడు. అతడు త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బొటనవేలి గాయం కారణంగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్, శ్రీలంకతో టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. జనవరి 10న శ్రీలంకతో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు.
‘రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అతడు ఒక అద్భుతమైన బ్యాటర్. 2019 వన్డే ప్రపంచకప్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఐదు శతకాలు సాధించాడు. ఈ విషయాన్ని గుర్తించుకొని రోహిత్ తిరిగి ఫామ్‌ను అందుకోవాలి. అతడు తిరిగి ఫామ్‌లోకి వస్తే.. వచ్చే వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ను మించిన బలమైన జట్టు మరొకటి ఉండదు. కచ్చితంగా అతడు సరికొత్తగా మంచి సాధనతో తిరిగొస్తాడు. అందుకోసం అతడు క్రమం తప్పకుండా ఫిట్‌నెస్, ఫామ్‌పై దృష్టి పెట్టాలి. అతడు ఒక గొప్ప ఆటగాడు అని చెప్పడంలో సందేహమే లేదు. అద్భుతమైన కెప్టెన్ కూడా. జట్టును ఎంతో చక్కగా ముందుండి నడిపించడగలడు. కానీ, ఫిట్‌నెస్, ఫామ్.. ఈ రెండు విషయాపై రోహిత్ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని నరేంద్ర మోదీ
-
Rishi Sunak: సిగరెట్లపై నిషేధం విధించనున్న సునాక్ ప్రభుత్వం!
-
Hyderabad: మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్తుల భవనాలు
-
Phonepe appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!