Asia Cup: బంగ్లాదేశ్‌తో సూపర్‌-4 మ్యాచ్‌.. రోహిత్, కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి!

ఆసియా కప్‌ సూపర్‌-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌కు భారత్‌ (Team India) తుది జట్టులో మార్పులు చేసే అవకాశముంది. 

Updated : 14 Sep 2023 20:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ సూపర్‌-4లో భాగంగా రేపు (సెప్టెంబరు 15) భారత్‌, బంగ్లాదేశ్ (IND vs BAN) తలపడనున్నాయి. సూపర్‌-4లో వరుసగా రెండు విజయాలు సాధించి భారత్ ఇప్పటికే ఫైనల్‌ చేరుకోగా.. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన భారత్‌.. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బంగ్లాతో మ్యాచ్‌కు కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశముంది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma)తోపాటు సీనియర్లు విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. గురువారం ఉదయం నిర్వహించిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌కు ఈ ముగ్గురు ఆటగాళ్లతోపాటు ఆల్‌రౌండర్ హార్ది్క్ పాండ్య దూరంగా ఉన్నారు. 

స్పెషల్‌ డే... సచిన్‌ ‘హిందీ’ ప్రశ్నలు... కుల్‌దీప్ ‘బెస్ట్‌’ అంటూ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

వెన్నునొప్పి కారణంగా సూపర్‌-4లో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ కోలుకుని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఫిజియోలు ఇచ్చే ఫిట్‌నెస్‌ రిపోర్ట్‌ను బట్టి అతడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడటం ఆధారపడి ఉంది. ఇక, అయ్యర్ స్థానంలో వచ్చి రాణించిన కేఎల్‌ ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్‌ శర్మ మ్యాచ్‌కు దూరంగా ఉంటే హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడు. ఇషాన్‌ కిషన్‌.. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి  ఓపెనింగ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్‌, శ్రేయస్ అయ్యర్‌ ఆడే అవకాశముంది. బుమ్రా స్థానంలో మహమ్మద్‌ షమి తుది జట్టులోకి రావొచ్చు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న సిరాజ్‌కు కూడా విశ్రాంతి ఇస్తే అతడి స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణకు చోటు దక్కొచ్చు. గురువారం పాకిస్థాన్‌, శ్రీలంక ఢీ కొట్టనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు.. సెప్టెంబరు 17న భారత్‌తో ఫైనల్‌ ఆడనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని