Sachin - Kuldeep: స్పెషల్‌ డే... సచిన్‌ ‘హిందీ’ ప్రశ్నలు... కుల్‌దీప్ ‘బెస్ట్‌’ అంటూ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ప్రశంసల వర్షం కురిపించాడు.

Updated : 14 Sep 2023 14:14 IST

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రెటీస్‌లో సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) ఒకరు. ఆయన ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ క్రీడలతోపాటు వివిధ అంశాలపై పోస్టులు పెడుతుంటారు. నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవాన్ని (Hindi Diwas)ను పురస్కరించుకుని ఎక్స్‌(ట్విటర్‌)లో సరదాగా అభిమానులకు నాలుగు ప్రశ్నలు సంధించారు. అంపైర్‌, వికెట్‌ కీపర్‌, ఫీల్డర్‌, హెల్మెట్‌ను హిందీలో ఏమని పిలుస్తారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కొంతమంది నెటిజన్లు కింది విధంగా సమాధానమిచ్చారు.


ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌ కుల్‌దీప్‌

టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం కుల్‌దీప్‌ యాదవ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌ అని కొనియడాడు. ఆసియాకప్‌ (Asia Cup 2023)లో కుల్‌దీప్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఐదు వికెట్లు పడగొట్టిన అతడు.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఆ స్పిన్నర్ల ఉచ్చులో కోహ్లి!

‘‘ప్రస్తుతం కుల్‌దీప్ యాదవ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌ అని భావిస్తున్నా. అతడి గణాంకాలు చాలా బాగున్నాయి. నిలకడగా వికెట్లు పడగొడుతున్నాడు. ఇటీవల వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇన్ని వికెట్లు పడగొట్టడం సాధారణ విషయం కాదు. 85 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఎడమ చేతి వాటంతో మణికట్టును ఉపయోగించి బంతిని స్పిన్‌ చేయడం అతడి ప్రత్యేకత (‘చైనామన్‌’ బౌలింగ్ శైలి). అజంతా మెండిస్, రషీద్‌ఖాన్‌ గురించి మాట్లాడుకుంటే వారు మిస్టరీ స్పిన్నర్లు. కానీ, కుల్‌దీప్‌ యాదవ్ అలా కాదు. అతడు సాధారణ లెగ్ స్పిన్, గూగ్లీ బౌలింగ్ చేస్తాడు. దానితోనే బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని