Sachin: కోహ్లీ.. నా హృదయాన్ని టచ్‌ చేశావయ్యా: సచిన్‌

ముంబయి వేదికగా విరాట్ కోహ్లీ వన్డేల్లో తన సెంచరీల రికార్డును బ్రేక్‌ చేయడంపై సచిన్‌ తెందూల్కర్‌ స్పందించారు.

Published : 16 Nov 2023 02:07 IST

ముంబయి: వన్డే క్రికెట్‌ చరిత్రలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 50 సెంచరీలతో తన రికార్డును బ్రేక్‌ చేయడంపై దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ స్పందించారు. కోహ్లీని ప్రశంసిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు.  కోహ్లీ తనను మొదటిసారి కలిసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ.. ‘‘తొలిసారి నిన్ను ఇండియన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కలిసినప్పుడు..  నా పాదాలను తాకుతుంటే ఇతర సహచరులు నిన్ను ప్రాంక్‌ చేశారు. అప్పుడు నాకూ నవ్వు ఆగలేదు. కానీ ఇంతలోనే నీ అంకితభావం, క్రీడా నైపుణ్యంతో నా హృదయాన్ని టచ్‌ చేశావ్‌.. ఆ యువకుడు ‘విరాట్’ ప్లేయర్‌గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు.

50 సెంచరీలు.. తిరుగులేని ‘కింగ్‌’!

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ (Virat Kohli) శతకం బాది సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  ఈ శతకంతో వన్డే చరిత్రలో 50 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ అవతరించాడు. ఇప్పటి వరకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (49) కలిసి సమాన రికార్డులో ఉన్న విరాట్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ శతకాన్ని నమోదు చేయడం విశేషం.  దీంతో పాటు ఒకే వన్డే ప్రపంచకప్‌లో 8సార్లు 50+ ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటాడు. ఇప్పటి వరకు సచిన్‌ 2003లో సాధించిన 673 పరుగులే అత్యధికం కాగా.. దాన్ని అధిగమించిన కోహ్లీ ప్రస్తుతం 694 పరుగులతో కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని