Sachin Tendulkar: కారు ఆపి అభిమానితో మాట్లాడిన సచిన్‌ తెందూల్కర్.. వీడియో వైరల్

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) కారు ఆపి మరీ ఓ అభిమానితో మాట్లాడాడు. ఆ వీడియోని ట్విటర్ (ఎక్స్‌)లో పంచుకున్నాడు. 

Updated : 02 Feb 2024 12:20 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ఆటకు వీడ్కోలు పలికి పదేళ్లు దాటినా అతడికి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. మాస్టర్‌ బ్లస్టర్‌కు దేశవిదేశాల్లో లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా సచిన్‌తో ఫొటో దిగడానికి, ఆటోగ్రాఫ్‌ తీసుకోవడానికి ఫ్యాన్స్‌ ఎగబడుతుంటారు. కానీ, ఇటీవల సచినే స్వయంగా ఓ అభిమానిని కలిశాడు. తన స్నేహితుడుతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ముంబయి ఇండియన్స్ జెర్సీ ధరించి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని సచిన్‌ చూశాడు. అతడి జెర్సీ వెనక భాగంలో ‘తెందూల్కర్ 10 ఐ మిస్‌ యూ’ అని రాసి ఉంది. ఆ అభిమానిని ఫాలో అయిన ఈ క్రికెట్‌ దిగ్గజం కొద్దిదూరం వెళ్లిన తర్వాత కారు ఆపి అతడితో మాట్లాడాడు.

విమానాశ్రయానికి ఎలా వెళ్లాలని అతడిని సచిన్‌ అడిగాడు. సచిన్‌ని చూసి ఆ అభిమాని ఆనందంలో మునిగిపోయాడు. తనను కలవడానికి కారు ఆపినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. తన చేతిపై ఉన్న సచిన్‌ టాటూని, లిటిల్ మాస్టర్‌కు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను అభిమాని తెందూల్కర్‌కి చూపించాడు. అనంతరం సచిన్‌ అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నందుకు అతడిని అభినందించాడు. తాను కూడా సీటు బెల్టు ధరించి ప్రయాణిస్తానని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్‌ తన ట్విటర్ (ఎక్స్‌) ఖాతాలో పంచుకోగా వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని