India vs Srilanka: గబ్బర్‌తో పృథ్వీషా ‘గెస్సింగ్‌ గేమ్‌’

శ్రీలంకలో పర్యటిస్తున్న భారత యువ జట్టు సరదాగా గడుపుతోంది. క్వారంటైన్లో ఉన్న క్రికెటర్లతో బీసీసీఐ వినూత్నమైన ఆటలు ఆడిస్తోంది. సారథి శిఖర్‌ ధావన్‌, యువ ఓపెనర్‌ పృథ్వీషాతో ‘గెస్సింగ్‌ గేమ్‌’ ఆడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్‌ చేసింది....

Published : 02 Jul 2021 01:23 IST

వీడియో పంచుకున్న బీసీసీఐ

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత యువ జట్టు సరదాగా గడుపుతోంది. క్వారంటైన్లో ఉన్న క్రికెటర్లతో బీసీసీఐ వినూత్నమైన ఆటలు ఆడిస్తోంది. సారథి శిఖర్‌ ధావన్‌, యువ ఓపెనర్‌ పృథ్వీషాతో ‘గెస్సింగ్‌ గేమ్‌’ ఆడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్‌ చేసింది.

మొదట ఈ ఆట నియమాలను పృథ్వీ షా వివరించాడు. ఆ తర్వాత శిఖర్‌ ధావన్‌ సంగీతం వినిపిస్తున్న హెడ్‌సెట్‌ను చెవులకు పెట్టుకున్నాడు. శ్రీలంకలో పర్యటిస్తున్న భారత ఆటగాళ్ల పేర్లను షా ఉచ్చరించాడు. వాటికి గబ్బర్‌ సమాధానాలు ఇచ్చాడు. ఆ తర్వాత షా వంతు వచ్చింది. అతడిని ధావన్‌ కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి అడిగాడు. ఈ ఆట ఆడుతున్నంత సేపు వీరిద్దరూ సరదాగా గడిపారు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ను ఆటకు నామినేట్‌ చేశారు.

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనింగ్‌ చేసే సంగతి తెలిసిందే. దాంతో ‘గెస్సింగ్‌ గేమ్‌’ సాంతం సరదాగా అనిపించింది. ఇద్దరి మధ్య అనుబంధం, చనువు ఉండటం గమనార్హం. ఇక వారు నామినేట్‌ చేసిన సూర్యకుమార్‌, ఇషాన్‌ ముంబయి ఇండియన్స్‌కు ఆడుతారు.

బీసీసీఐ పెట్టిన ఈ వీడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉత్కంఠకరమైన అంశాలతో బీసీసీఐ సోషల్‌ మీడియా విభాగం ఈ మధ్య ముందుకొస్తోందని ఓ అభిమాని అన్నాడు. మున్ముందు వడాపావ్‌, పృథ్వీషా మీమ్స్‌ వస్తాయని మరొకరు అంచనా వేశారు. అంతేకాదు, వడాపావ్‌ ప్రేమికులు మంచి ఆటగాళ్లని కితాబిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని