NEW YEAR 2024: గతేడాది ఎన్నో అనుభవాలు.. మరెన్నో పాఠాలు నేర్పింది: శుభ్‌మన్‌ గిల్

కొత్త సంవత్సరంలోకి (New Year 2024) అడుగు పెట్టేటప్పుడు ఏం సాధించాలనే దాని గురించి ఓ అంచనాకు వస్తాం. అలాగే గతేడాది ఏం సాధించామని పరిశీలించుకుంటాం. తాజాగా శుభ్‌మన్‌ గిల్‌ (Shubman gill) పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 01 Jan 2024 13:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది నేర్పిన పాఠాలతో.. నూతన ఉత్సాహంతో, కొంగొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలో దూసుకుపోవాలని ప్రతి ఒక్కరూ  కోరుకుంటారు. టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూనే.. గతేడాది తాను ఏం సాధించాలని అనుకున్నానో తెలుపుతూ.. ఓ జాబితాను సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఇప్పుడది వైరల్‌గా మారింది. ఓ పేపర్‌ ముక్క మీద ఇలా రాయడం విశేషం.

‘‘సంవత్సరం కిందట ఏం చేయాలనే అంశాలతో కూడిన జాబితాను తయారు చేశా. ఇప్పుడు 2023 ఏడాదికి ముగింపు పలికేశాం. ఆ సంవత్సరం ఎన్నో అనుభవాలు, ఎంతో సంతోషం, మరెన్నో పాఠాలు నేర్చుకున్నా. అయితే.. చివర్లో అనుకున్నంత సాఫీగా సాగలేదు. కానీ, మా లక్ష్యాలకు చేరువగా వచ్చామని భావిస్తున్నా. కొత్త ఏడాదిలో ఎదురయ్యే కొత్త సవాళ్లను తట్టుకునేందుకు.. నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంటాం. 2024లో మన లక్ష్యాలను సాధించి అభిమానులకు మరింత ప్రేమ, సంతోషం పంచుతాం. ప్రతి ఒక్కరికీ శక్తియుక్తులను అందించాలని కోరుకుంటూ..’’ అంటూ గిల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇటీవలే గిల్ గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే.

ఈ జాబితాలో ఉన్నవేంటంటే..

  • ఈ ఏడాది(2023) భారత్‌ తరఫున అత్యధిక సెంచరీలు బాదడం..
  • కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచడం
  • అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి మెరుగైన ఫలితాలు సాధించడం
  • వరల్డ్‌ కప్‌లో ఆడటం.. 

సచిన్‌ శుభాకాంక్షలు.. 

నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు సచిన్‌ తెందూల్కర్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘కొత్త సంవత్సరంలో కొత్త కలలు, కొత్త ఆశలు నెరవేరాలి. లక్ష్యం దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. పాజిటివ్‌ ఆలోచనలతో జీవిత లక్ష్యాలను సాధించాలి. ప్రతిఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని సచిన్‌ ట్వీట్ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు