ICC Rankings: మహ్మద్‌ సిరాజ్‌ని వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకొచ్చిన సౌతాఫ్రికా స్పిన్నర్

ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌ మహారాజ్‌ (Keshav Maharaj) అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.

Published : 14 Nov 2023 22:40 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌ మహారాజ్‌ (Keshav Maharaj) అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 4.37 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కేశమ్‌ మహారాజ్‌ (726 పాయింట్లు) ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ (723 పాయింట్లు)ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. టాప్‌-5లో ముగ్గురు భారత బౌలర్లు ఉండటం విశేషం. బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ రెండు స్థానాలు మెరుగై వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

బ్యాటింగ్ విభాగంలోనూ టాప్‌-5లో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. శుభ్‌మన్‌ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్, మూడో స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్, కోహ్లీ, రోహిత్‌ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. నెదర్లాండ్స్‌పై సెంచరీలు బాదిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. శ్రేయస్ ఐదు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో, కేఎల్ రాహుల్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానంలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు