SA vs NED: ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: దక్షిణాఫ్రికా కెప్టెన్‌

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఓడిన సఫారీ సేన ఇంటి బాట పట్టింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ టెంబా బవుమా, బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కంటతడిపెడుతూ కనిపించారు. 

Updated : 06 Nov 2022 15:13 IST

అడిలైడ్‌: టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలను నమోదు చేసిన దక్షిణాఫ్రికా జట్టుకు నెదర్లాండ్స్‌ చెక్‌ పెట్టింది.  ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓడిన సఫారీ సేన ఇంటి బాట పట్టింది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ టెంబా బవుమా, బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కంటతడిపెడుతూ కనిపించారు. 

ఈ టోర్నమెంట్‌లో ఎంతో గొప్ప ప్రదర్శన ఇచ్చినా సెమీస్‌కు చేరలేకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బవుమా పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మరోసారి మేం తడబడ్డాం. ఈ మ్యాచ్‌ గెలుస్తామని అనుకున్నాం. కానీ ఈ ఓటమిని మా జట్టు జీర్ణించుకోలేకపోతోంది. టాస్‌ గెలిచినప్పటికీ ప్రత్యర్థిని 158 పరుగులు చేయకుండా కట్టడిచేయలేకపోయాం. పాక్‌తో మ్యాచ్‌లోనూ ఇలాగే కీలక సమయంలో వికెట్లను కోల్పోయాం. మేం మరింత శ్రమించి ఉండాల్సింది’’ అంటూ సఫారీల కెప్టెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోవైపు సూపర్‌ 12 దశలో మరో విజయం నమోదు చేసిన నెదర్లాండ్స్‌ తమ విజయంపై హర్షం వ్యక్తం చేసింది. తమకు ఇదెంతో గొప్ప అనుభవమని జట్టు కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ పేర్కొన్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని