suryakumar yadav: సర్ఫరాజ్‌ సెంచరీపై సూర్యకుమార్‌ ట్వీట్‌

సెంచరీ కొట్టిన ఈ ముంబయి ఆటగాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన అభినందనలు తెలియజేశాడు.

Updated : 03 Oct 2022 00:26 IST

దిల్లీ: ఇరానీ కప్‌ పోరు రసవత్తరంగా సాగుతోంది. శనివారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. పేలవమైన ఆటతీరుతో చతికిలపడింది. ఐదో ఓవర్లో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా గెలుపు బాధ్యతను  కెప్టెన్‌ హనుమ విహారీతో కలిసి బ్యాటర్‌  సర్ఫరాజ్‌ ఖాన్‌ భుజాలకెత్తుకున్నాడు. సర్ఫరాజ్‌ సెంచరీతో జట్టు స్కోర్‌ అమాంతం దూసుకెళ్లింది. దీంతో ఈ ముంబయి ఆటగాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన అభినందనలు తెలియజేశాడు. ‘నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నా’ అంటూ టీవీలో ప్రసారమవుతున్న అతడి గెలుపును చూపుతూ సెల్ఫీ పోస్ట్‌ చేశాడు.  తన సొంత రాష్ట్రమైన ముంబయి తరపున ఆడి టీమ్‌ఇండియాలో చోటు సంపాదించుకున్న సూర్య.. తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన జూనియర్‌ గెలుపును ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 కోసం ఈ 360 డిగ్రీ ప్లేయర్‌ గువాహటి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని