T20 World Cup: రాణించిన మార్‌క్రమ్‌.. వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా విజయం..

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మార్‌క్రమ్‌ (51; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డస్సెన్‌ (43; 51 బంతుల్లో 3 ఫోర్లు, ) రాణించడంతో విండీస్‌ నిర్దేశించిన  144 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించింది.

Updated : 26 Oct 2021 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మార్‌క్రమ్‌ (51; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డస్సెన్‌ (43; 51 బంతుల్లో 3 ఫోర్లు, ) రాణించడంతో విండీస్‌ నిర్దేశించిన  144 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ బావుమా (2) తర్వగా పెవిలియన్ చేరినా తర్వాత వచ్చిన డస్సెన్‌.. ఓపెనర్ హెన్‌డ్రిక్స్‌(39)తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. హొస్సెన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో హెన్‌డ్రిక్స్‌ హెట్‌మయర్‌కి చిక్కాడు. తర్వాత మార్‌క్రమ్,  డస్సెన్‌ నిలకడగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.విండీస్‌ తొలి మూడు ఓవర్లలో ఆరు పరుగులే చేసింది. నాలుగో ఓవర్‌ నుంచి గేర్ మార్చిన ఎవిన్‌ లూయిస్ ఫోర్లు సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ లెండిల్‌ సిమ్మన్స్‌ (16) నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత లూయిస్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్ (12) దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ మిల్లర్‌కి చిక్కి క్రీజు వీడాడు. కగిసో రబాడ వేసిన 14వ ఓవర్లో సిమ్మన్స్ బౌల్డై మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రిస్ గేల్ (12), షిమ్రోన్ హెట్‌మైర్‌ (1), ఆండ్రూ రస్సెల్ (5), హేడెన్‌ వాల్ష్‌ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన పొలార్డ్‌ (26) పరుగులు చేశాడు. డ్వేన్‌ బ్రావో (8), అకీల్ హోసీన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ మూడు, కేశవ్‌ మహరాజ్‌ రెండు, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే తలో వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని