IPL 2021: ధోనీ ఇకపై నాలుగో స్థానంలో రావాలి : గంభీర్‌

గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్‌ చేరకుండా నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి టాప్‌లో దూసుకుపోతోంది. పాయింట్ల పట్టికలో దిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడుతోంది...

Updated : 27 Sep 2021 07:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్‌ చేరకుండా నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి టాప్‌లో దూసుకుపోతోంది. పాయింట్ల పట్టికలో దిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడుతోంది. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో మొత్తం ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో 16 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచింది. ఈ క్రమంలోనే చెన్నై ప్లేఆఫ్స్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.

అయితే, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోనీ గతేడాది నుంచి తన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసుకొని ఏడో స్థానంలో బరిలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గత రెండు, మూడు మ్యాచ్‌ల్లో ఆరో స్థానంలో వస్తున్నాడు. దీనిపై స్పందించిన గంభీర్‌.. మహీ ఇకపై నాలుగో స్థానంలో రావాలని సూచించాడు. ‘చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాక ధోనీ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మరింత ముందుకు రావాలి. తొలుత బ్యాటింగ్‌ చేసినా లేదా ఛేదనలోనైనా.. ఎప్పుడు ఎలా ఆడినా అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలి. అది నేను చూడాలని ఆశిస్తున్నా’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. ధోనీ ఎన్ని ఎక్కువ పరుగులు సాధిస్తే జట్టుకు అంత మంచిదని, చెన్నై ప్లేఆఫ్స్‌ చేరినప్పుడు భారం మొత్తం తనపైనే మోయొద్దని గంభీర్‌ సూచించాడు. టాప్‌ ఆర్డర్‌లో త్వరగా వికెట్లు కోల్పోతే అప్పుడు పరుగులు చేసే బాధ్యత తీసుకోవాలని కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని