T20 World Cup: ఈ వీడియో చూస్తే బంగ్లా కెప్టెన్‌ను మెచ్చుకోవాల్సిందే!

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మహ్మదుల్లాను నెటిజన్లు బాగా మెచ్చుకుంటున్నారు. ఎందుకో తెలిస్తే మీరు కూడా అభినందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదివారం రాత్రి బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో...

Published : 19 Oct 2021 13:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మహ్మదుల్లాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకో తెలిస్తే మీరు కూడా మెచ్చుకోక మానరు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో అర్హత పోటీల్లో పాల్గొని ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో బంగ్లా కెప్టెన్‌ మహ్మదుల్లా విలేకర్లతో మాట్లాడుతూ ఒక్కసారిగా కొద్దిసేపు నిశబ్దంగా ఉండిపోయాడు. ఎందుకంటే అదే సమయంలో స్కాట్లాండ్‌ ఆటగాళ్లు భారీ శబ్దం చేస్తూ తమ జాతీయ గీతాలాపన చేశారు. అది వినగానే మహ్మదుల్లా గౌరవ సూచకంగా అలా ఉండిపోయాడు. అది పూర్తయిన వెంటనే మళ్లీ విలేకర్లతో మాట్లాడాడు.

ఈ విషయం తెలుసుకున్న స్కాట్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఆ ప్రెస్‌మీట్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని అతడికి క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని తెలిపింది. మరో ట్వీట్‌లో మహ్మదుల్లా అంతసేపు మౌనంగా వేచి చూసినందుకు ప్రత్యేకంగా అభినందించింది. దీంతో నెటిజన్లు సైతం బంగ్లా కెప్టెన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌ 140/9 స్కోర్‌ సాధించింది. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లు పూర్తిగా ఆడి 134/7కే పరిమితమైంది. దీంతో ఆ జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మీరూ ఆ వీడియో చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని