IND vs ENG: మ్యాచ్‌ను మలుపు తిప్పిన బుమ్రా.. వరుస బంతుల్లో రెండు వికెట్లు

ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా పేసర్ బుమ్రా ఆరంభంలో వరుసగా రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను గట్టిదెబ్బకొట్టాడు. 

Published : 30 Oct 2023 02:15 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయ సాధించింది. ఈ గెలుపుతో టీమ్‌ఇండియా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. లివింగ్‌స్టోన్ (27) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. షమి (4/22), బుమ్రా (3/32), కుల్‌దీప్ యాదవ్‌ (2/24) ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. జడేజా ఒక వికెట్‌ పడగొట్టాడు.

లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ మొదటి నాలుగు ఓవర్లలో 26/0తో నిలిచింది. దీంతో టీమ్‌ఇండియా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే, జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో డేవిడ్ మలన్ (16; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి ఇంగ్లాండ్‌ను గట్టిదెబ్బకొట్టాడు. ఐదో బంతిని మలన్‌ వికెట్ల మీదికి ఆడుకోగా.. చివరి బంతికి రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. తర్వాత కూడా బుమ్రా, షమి వరుసగా వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్‌ను టీమ్ఇండియా చేజిక్కించుకుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు