Yuvraj Singh-Ashwin: అశ్విన్‌కు జట్టులో ఉండే అర్హత లేదు.. యువరాజ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు

టీమ్ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ (Yuvraj Singh) సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Published : 14 Jan 2024 18:36 IST

ఇంటర్నెట్ డెస్క్: రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ (Yuvraj Singh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌ గొప్ప బౌలరే అయినప్పటికీ అతడికి పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో ఉండే అర్హత లేదన్నాడు. ‘‘అశ్విన్‌ గొప్ప బౌలర్‌. కానీ, వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా అతడు ఏం ప్రభావం చూపగలడు? టెస్టుల్లో మాత్రం అతడు ఉండాల్సిందే. కానీ, వైట్‌బాల్‌ క్రికెట్ జట్టులో అతడికి చోటు అవసరం లేదు’’ అని యువీ వ్యాఖ్యానించాడు. అశ్విన్‌, యువరాజ్‌ చాలాకాలంపాటు కలిసి ఆడారు. టీమ్‌ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన జట్టులోనూ ఉన్నారు.   

అశ్విన్‌ చాలా కాలంపాటు మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఎక్కువగా టెస్టులపై ఫోకస్‌ పెట్టిన 37 ఏళ్ల అశ్విన్‌.. 2023 ప్రపంచకప్‌ జట్టులోనూ అనుహ్యంగా చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికీ అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. భారత్‌ తరఫున 95 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని