David Miller: 3, 4 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది: డేవిడ్‌ మిల్లర్

అండర్‌ డాగ్స్‌గా అడుగుపెట్టి ట్రోఫీ సాధించడం గొప్పగా ఉందని, ఇది తనకు మధురజ్ఞాపకంగా నిలిచిపోతుందని గుజరాత్‌ మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్ మిల్లర్‌ హర్షం వ్యక్తం చేశాడు...

Published : 31 May 2022 02:13 IST

(Photo: David Miller Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: అండర్‌ డాగ్స్‌గా అడుగుపెట్టి ట్రోఫీ సాధించడం గొప్పగా ఉందని, ఇది తనకు మధురజ్ఞాపకంగా నిలిచిపోతుందని గుజరాత్‌ మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్ మిల్లర్‌ హర్షం వ్యక్తం చేశాడు. గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన తుదిపోరులో అతడు (32 నాటౌట్‌; 19 బంతుల్లో 3x4, 1x6) మరోసారి ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగిన సంగతి తెలిసిందే. అంతకుముందు లీగ్‌ స్టేజ్‌లోనూ పలు మ్యాచ్‌ల్లో ఫినిషర్‌గా వచ్చి దంచికొట్టాడు. దీంతో గుజరాత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం రషీద్‌ ఖాన్‌తో మాట్లాడిన మిల్లర్‌.. ఈ సీజన్‌లో తాను రాణించడానికి బాగా కష్టపడ్డానని చెప్పాడు. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు 3-4 ఏళ్లుగా ప్రత్యేకంగా సన్నద్ధమైనట్లు తెలిపాడు. ‘ఈ టోర్నీలో నేను చాలాసార్లు విఫలమయ్యాను. దాంతో ఈసారి ఎలాగైనా రాణించాలని నిర్ణయించుకున్నా. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకుంటూ.. రన్‌రేట్‌ను సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అలాంటప్పుడు మైదానంలో ప్రశాంతంగా ఉంటూ నాపని నేను చేసుకుపోవాలని అనుకున్నా. అయితే, ఈ సీజన్‌లో నేను బాగా ఆస్వాదించింది స్పిన్‌ బౌలింగ్‌ని. దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నా. ఈ విషయంలో కొంతకాలంగా కష్టపడుతున్నా. నా బ్యాటింగ్‌లో మార్పులు చేసుకొని ఇప్పుడు విజయం సాధించా’ అని మిల్లర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని