Pujara - Malik : పుజారా పునరాగమనం నమ్మశక్యం కాని విషయం: ఎంఎస్‌కే ప్రసాద్

హైదరాబాద్‌ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ను టీమ్‌ఇండియా జట్టులోకి  తీసుకోవడం మంచి పరిణామమని...

Published : 25 May 2022 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ను టీమ్‌ఇండియా జట్టులోకి  తీసుకోవడం మంచి పరిణామమని  బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్ అభినందించాడు. అలానే అతడిని ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించాడు. ఛెతేశ్వర్‌ పుజారా మళ్లీ టెస్టు జట్టులోకి రావడం నమ్మశక్యంగా లేదన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై శ్రీలంకతోనూ జట్టులో స్థానం కోల్పోయిన పుజారా ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టాడు. దీంతో మరోసారి టెస్టు జట్టులోకి పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఉమ్రాన్‌, పుజారా జట్టులోకి రావడంపై ఎంఎస్‌కే మాట్లాడాడు. 

‘‘పుజారా రాకపై ఒకే మాట చెప్పగలను. ఇది నమ్మశక్యం కానిది. ఇంతే  ఇంకేమీ చెప్పలేను. ఆటపట్ల ఉన్న కమిట్‌మెంట్‌ పుజారాలో కనిపిస్తోంది. దీని కోసం పుజారా చేసిన కృషి చాలా మంది నమ్మరు. కౌంటీల్లో చెలరేగడంతో టెస్టు జట్టులోకి అవకాశం వచ్చింది. అతడు ఎప్పుడూ టెస్టు క్రికెటర్‌గానే ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విఫలం చెందాక పుజారా మళ్లీ జట్టులోకి రావడం కష్టమేనని చాలా మంది భావించారు. అయితే దీనికోసం పుజారా చాలా కష్టపడ్డాడు. కాబట్టి కచ్చితంగా పుజారా మరికొన్ని సంవత్సరాల పాటు టెస్టు క్రికెట్ ఆడతాడు. ఇక ఉమ్రాన్‌ మాలిక్‌ ఎదిగేలా మద్దతు ఇవ్వాలి. ఆసీస్, ఇంగ్లాండ్‌ పిచ్‌లకు మాలిక్ పేస్‌ చాలా చక్కగా సరిపోతుంది’’ అని ఎంఎస్‌కే ప్రసాద్ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని