
పిలుస్తోంది.. నయా ప్రపంచం
సాంకేతిక ప్రపంచంలో అందరి నోటా మెటావర్స్ మాటే. ఇందులో ఎన్నెన్నో సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేస్తున్నాయి. తాజాగా ఫేస్బుక్ సైతం దీనిలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించేసింది. ఇంతకీ మెటావర్స్ అంటే ఏంటి? భవిష్యత్ ఇంటర్నెట్గా భావిస్తున్న ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది?
అంచనాలకు అందకుండా టెక్నాలజీ రంగం తరచూ ఆశ్చర్యానికి గురిచేస్తూనే వస్తోంది. అలాగని అసలే పసిగట్టలేమని కాదు. పెద్ద పెద్ద మార్పులు చాలావరకు దశాబ్దాల ముందుగా ఊహించినవే. పుస్తకాలు, రికార్డులు, కమ్యూనికేషన్ల వంటివన్నీ ఒకే పరికరంలో స్టోర్ అయ్యి ఉంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ యాంత్రికంగా ఒకదాంతో మరోటి అనుసంధానమైతే ఎలా ఉంటుంది? అని వనీవర్ బుష్ 1945లోనే ఊహించారు. ఈ పరికరానికి ‘మెమెక్స్’ అనే పేరునూ పెట్టారు. ఈ భావనే ‘హైపర్‌టెక్స్ట్’ ఆలోచనకు పునాది వేసింది. రెండు దశాబ్దాల అనంతరం ‘వరల్డ్ వైడ్ వెబ్’ అభివృద్ధికి దారితీసింది ఇదే. ఇప్పుడంటే స్ట్రీమింగ్ యుద్ధాలు మొదలయ్యాయి గానీ మొదటి వీడియో 25 ఏళ్ల కిందటే ప్రసారమైంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సేవలను ఆరంభించినప్పుడే టెలివిజన్ భవిష్యత్ ఆన్లైన్ మీదే ఆధాపడి ఉందని హాలీవుడ్‌కు అవగతమైంది. ఇలాగే మెటావర్స్ కూడా 70ల చివర్లో, 80ల ఆరంభంలోనే పురుడు పోసుకుంది. భవిష్యత్ ఇంటర్నెట్ ఇదేనని అప్పట్లోనే ఊహించారు. డిజిటల్ ప్రపంచపు మౌలిక సదుపాయాలనే కాదు.. మన అవసరాల విషయంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని భావించారు. సేవలు.. అన్నింటికీ మించి ఆయా ప్లాట్‌ఫామ్స్ పనితీరు, వస్తువుల క్రయవిక్రయాలను గణనీయంగా మార్చగలదని గట్టిగానే విశ్వసించారు. డిజిటల్, వాస్తవ ప్రపంచాల మధ్య హద్దులు చెరిపేసి.. కాల్పనిక వాస్తవాన్ని వాస్తవ ప్రపంచంతో అనుసంధానం చేసే దీని కోసం ఎంతోకాలంగా కృషి చేస్తున్నా ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఆధునిక ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ పరికరాల ఆవిష్కరణతో కలల లోకాన్ని కళ్ల ముందు కదలాడేలా చేయటానికి సిద్ధమవుతోంది.
మెటావర్స్ అంటే?
ప్రస్తుతం ఇంటర్నెట్ చాలావరకు టెక్స్ట్, ఇమేజెస్, వీడియోల మీదే ఆధారపడి ఉంది. దీనికి భవిష్యత్ రూపమే మెటావర్స్. ఇందులో 3డీ వర్చువల్ స్పేసెస్దే కీలక పాత్ర. ఇవి భావనాత్మక వర్చువల్ విశ్వంలో ఒకదాంతో మరోటి అనుసంధానమై ఉంటాయి. అంటే మెటావర్స్‌లో 3డీ రూపంలో ఒకరితో ఒకరు కలవటం నిజ ప్రపంచంలో మాదిరిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఇంటర్నెట్ను పలు రకాలుగా వినియోగించుకోవచ్చు. వర్చువల్ వస్తువులతో నిజ జీవితంలో మాదిరిగా జీవించొచ్చు. ఉదాహరణకు- ఇప్పుడు మనం జూమ్ సమావేశాలను కంప్యూటర్లోనో, మొబైల్లోనో నిర్వహిస్తున్నాం కదా. మెటావర్స్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇవేవీ అవసరముండవు. వీఆర్ హెడ్‌సెట్‌ను తలకు ధరిస్తే సమావేశంలో పాల్గొనే అందరూ వర్చువల్ టేబుల్ చుట్టూ కూర్చొని, 3డీ రూపంలో ఒకరిని ఒకరు చూస్తూ మాట్లాడొచ్చు. అంతా ఒకే గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంటుంది. దీంతో వాస్తవంగా కలిసి చర్చించుకుంటున్న భావన కలుగుతుంది. మెటావర్స్ కేవలం మీటింగులకే పరిమితమయ్యేది కాదు. వీఆర్ టెక్నాలజీ రోజురోజుకీ అధునాతనంగా మారుతోంది. ఆయా పనులకు వినియోగించుకునేలా తయారవుతోంది. వీటిని మెటావర్స్‌లోనూ కాల్పనిక ప్రపంచంలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు- బ్యాంకులకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడొచ్చు. గ్యాలరీకి వెళ్లి కళాకృతులు సందర్శించొచ్చు. వర్చువల్ దుకాణాల్లో షాపింగ్ చేయొచ్చు. ఇలా ఆర్డరు చేయగానే అలా కంపెనీలకు చేరతాయి. అక్కడే డబ్బు చెల్లిస్తే సరుకులు నిజంగా ఇంటికి చేరతాయి. అంతేనా? మెటావర్స్ ద్వారా అనుసంధానమైన కాల్పనిక వాస్తవ ప్రాంతాల్లో ఇతరులతో కలిసి టెన్నిస్ వంటి ఆటలూ ఆడుకోవచ్చు. వీఆర్ హెడ్‌సెట్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అద్దాలు, స్మార్ట్‌ఫోన్ యాప్స్‌తో ఇలా కాల్పనిక వాస్తవ ప్రపంచంలో ఎన్నెన్నో పనులు చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి షికారు చేయొచ్చు. ఇళ్లను కొనుక్కోవచ్చు. భూములు కొనుక్కోవచ్చు. ఆయా కార్యక్రమాలకు హాజరు కావొచ్చు. అంటే వీడియో సమావేశాలు, ఆన్లైన్ గేమ్స్, ఈమెయిళ్లు, వర్చువల్ రియాలిటీ, సామాజిక మాధ్యమాలు, ప్రత్యక్ష ప్రసారాలు.. అన్నీ ఒక్క మెటావర్స్‌లోనే నిక్షిప్తమై ఉంటాయన్నమాట.
ఎన్నెన్నో మార్పులు
ప్రస్తుతానికి మెటావర్స్ ఉనికిలో లేదు గానీ మున్ముందు వినూత్న టెక్నాలజీల సాయంతో పెను మార్పులకు శ్రీకారం చుట్టటం ఖాయం. వీటిల్లో ప్రధానమైనవి వీఆర్ హెడ్‌సెట్స్. ఇప్పటికే వీటిని ఎంతోమంది ఉపయోగిస్తున్నారు. మరింత నాణ్యమైన, తేలికగా ఉపయోగించగల రకాలూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి గేమ్స్ ఆడుకోవటానికే పరిమితం కావటం లేదు. మొజిల్లా వెబ్ఆర్, ఫైర్ఫాక్స్ రియాలిటీ వంటి కొత్త ఇంటర్నెట్ పరిజ్ఞానాలు ఇతరులతో తేలికగా కనెక్ట్ కావటానికి ఉపయోగపడుతున్నాయి. బ్లాక్‌చైన్ పరిజ్ఞానంతో పుట్టుకొచ్చిన క్రిప్టోకరెన్సీలూ ఉత్తేజం కలిగిస్తున్నాయి. మెటావర్స్‌లో వీటితోనే వస్తువులు, భూములు, భవనాలు, డిజిటల్ మానవ రూపాలను కొనుక్కోవచ్చని, అమ్ముకోవచ్చని.. సేవలు పొందొచ్చని భావిస్తున్నారు. అంటే కాల్పనిక ప్రపంచంలో దేశాల మధ్య సరిహద్దులకు, ప్రభుత్వాల జోక్యాలకు ఎలాంటి తావుండదన్నమాట. ఇప్పటికే డీసెంట్రలాండ్, క్రిప్టోవోక్సెల్స్, సాండ్‌బాక్స్ వంటి వినూత్న కాల్పనిక ప్రపంచాలు పుట్టుకొచ్చేశాయి. వీటిని లక్షలాది మంది వినియోగిస్తున్నారు. డిజిటల్ వాతావరణాల్లో భూములూ కొంటున్నారు. ఇటీవల ఒక ప్లాటు 9లక్షల డాలర్లకు (రూ.6,73,98,615) అమ్ముడైంది కూడా. గేమ్స్ రంగంలోనూ మెటావర్స్ సంచలనాలు సృష్టించనుంది. ఫ్రంట్‌లైన్, మైన్‌క్రాఫ్ట్, రోబ్లాక్స్ వంటి ఆన్లైన్ గేమింగ్ వేదికలు విస్తృతరూపం ధరిస్తున్నాయి. ఇవి ఒక్క గేమ్‌లకే పరిమితం కాకుండా సామాజిక వేదికలుగానూ మారుతున్నాయి. వర్చువల్ క్లబ్‌లు, కచేరీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటిని ఒకరకంగా మెటావర్స్ రూపాలుగానే భావించొచ్చు. తాజాగా ప్రాచుర్యం పొందుతున్న డిజిటల్ సంపద నాన్-ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) సైతం మెటావర్స్‌లో కీలకపాత్ర పోషించనుంది.
పెరగనున్న ఆదరణ
కొవిడ్-19 నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేయటం వంటి వాటితో ఆన్‌లైన్‌కు బాగా ఆదరణ పెరిగింది. పనులైనా, వ్యాపారాలైనా, వినోదమైనా అన్నీ ఆన్లైన్లోనే కానిచ్చేస్తున్నారు. గేమ్ ప్రియులు డిజిటల్ ప్రపంచంలో విహరిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ఇవన్నీ ఒకరకంగా మెటావర్స్ దిశగా డిజిటల్ ప్రపంచాన్ని నడిపేలా పురికొల్పుతున్నాయి. వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, కాల్పనిక వాతావరణాలకు మధ్య సరిహద్దులు చెరిపేస్తున్నాయి. అందువల్ల మున్ముందు మెటావర్స్కు చాలా ఆదరణ పెరగనుందని భావిస్తున్నారు.
ఒకప్పుడు ఆన్లైన్ షాపింగ్ అంటేనే ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు వీటితోనే దాదాపు అన్ని వస్తువులను కొంటున్నారు. సేవలను పొందుతున్నారు. మెటావర్స్ రాకతో ఇలాంటి డిజిటల్ ప్రపంచ అనుభూతులు మరింత విస్తృతం అవుతాయనటంలో సందేహం లేదు.
సైన్స్ కాల్పనిక కథ నుంచి
మెటా అంటే మించి, దాటి అని. విశ్వాన్ని దాటి అని అర్థం స్ఫురించేలా దీనికి యూనివర్స్‌లోని వర్స్ను జోడించి మెటావర్స్ పదాన్ని సృష్టించారు. దీన్ని నీల్ స్టీఫెన్సన్స్ అనే రచయిత తొలిసారిగా వాడారు. ఆయన 1992లో రాసిన స్నో క్రాష్ అనే సైన్స్ ఫిక్షన్ నవలలో దీన్ని వాడారు. ఇందులో మనుషులు ప్రత్యేకమైన అద్దాలు ధరించి, డిజిటల్ అవతారాలుగా హెచ్డీ వర్చువల్ వాతావరణంలో ఒకరినొకరు కలుసుకుంటారు. ఇలాంటి భావనతోనే 2018లో రడీ ప్లేయర్ వన్ అనే సినిమా కూడా వచ్చింది. ఎర్నెస్ట్ క్లైన్ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమాలో ప్రజలు రోజులో ఎక్కువ భాగం వీఆర్ హెడ్సెట్లతోనే గడుపుతుంటారు. ఓయాసిస్ అనే విశాలమైన కాల్పనిక వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఆ కల్పనే నేడు నిజమవుతోంది. కాల్పనిక వాస్తవ ప్రపంచంలో వాస్తవంగా విహరించేలా చేయనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Sri Lanka crisis: శ్రీలంకలో ఇంధనానికి టోకెన్లు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత!
-
Sports News
arshdeep: ఉమ్రాన్ ఓకే.. మరి అర్ష్‌దీప్ సంగతేంటి?
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 4 రోజుల్లో 94వేల మంది దరఖాస్తు
-
General News
Andhra news: ‘అమ్మఒడి’లో మరో కుదింపు.. ల్యాప్‌టాప్‌లు ఇచ్చే విధానానికి స్వస్తి!
-
General News
Telangana news: కలుషిత ఆహారం తిని 128మంది బాలికలకు అస్వస్థత
-
Politics News
Telangana news: ప్రశ్నిస్తే.. రైతులపై కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారు: రేవంత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Russia: 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో రష్యా విఫలం ..!