రాతపై పట్టు సాధించేలా..

ఎలాంటి వ్యాకరణ దోషాలు లేకుండా.. అక్షర దోషాలు దొర్లకుండా జాగ్రత్త పడాలంటే? ఇవిగోండి ఈ సర్వీసుల్ని ఆసరాగా తీసుకోండి. 

Published : 03 Mar 2021 15:56 IST

ఆఫీస్‌ పని నిమిత్తమో.. చేస్తున్న ప్రాజెక్టు గురించో ఇంగ్లిష్‌లో ఏదైనా రాయాల్సి వచ్చింది. అప్పుడు ఎలాంటి వ్యాకరణ దోషాలు లేకుండా.. అక్షర దోషాలు దొర్లకుండా జాగ్రత్త పడాలంటే? ఇవిగోండి ఈ సర్వీసుల్ని ఆసరాగా తీసుకోండి. 


అంతా ఆన్‌లైన్‌లోనే.. లాంగ్వేజ్‌ టూల్‌

ఇదో రైటింగ్‌ అసిస్టెంట్‌లా ఉపయోగపడుతుంది. రాసిన ఉత్తరంలో అక్షర దోషాల్ని కనిపెట్టొచ్చు. వ్యాకరణ దోషాల్నీ చెబుతుంది. యాడ్‌ఆన్‌లా క్రోమ్‌ బ్రౌజర్‌కి జత చేసుకునే వీలుంది. ఇతర బ్రౌజర్లనీ సపోర్టు చేస్తుంది. ఉచిత వెర్షన్‌లో కొన్ని సదుపాయాల్ని వాడుకోవచ్చు. ప్రీమియంలో మరిన్ని అదనం. * https://languagetool.org


అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి.. ప్రొరైటింగ్‌ఎయిడ్‌

3ఎక్స్‌టెన్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని అకౌంట్‌ క్రియేట్‌ చేసుకుని రాతల్ని స్పెల్‌చెక్‌ చేయొచ్చు. చక్కగా ప్రూఫ్‌రీడింగ్‌ చేసే వ్యక్తిగత అసిస్టెంట్‌లా పని చేస్తుంది. గూగుల్‌ డాక్స్, ఆఫీస్‌ 365లోనూ సేవల్ని వాడుకోవచ్చు. * https://prowritingaid.com


కృత్రిమ మేధస్సుతో..జింజర్‌

ఏఐ-పవర్డ్‌ అసిస్టెంట్‌ని పెట్టుకుని పని చెప్పడం అన్నమాట. వెబ్‌లో ఎక్కడైనా ఈ సర్వీసుని వాడుకోవచ్చు. అంటే.. మీరేదైనా ఈమెయిల్‌ని కంపోజ్‌ చేస్తే.. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే చెక్‌ చేయవచ్చు. ప్రీమియం వెర్షన్‌లో  అదనపు సౌకర్యాలు ఉన్నాయి. * https://www.gingersoftware.com/


ఆఫీస్‌ అవసరాల్లో.. సాప్లింగ్‌

క్లైంట్స్‌తో నిత్యం కమ్యూనికేట్‌ చేయాల్సి వస్తే.. సాప్లింగ్‌ సాయం తీసుకోవచ్చు. తప్పులు చెప్పడమే కాదు. స్మార్ట్‌గా కంపోజ్‌ కూడా చేస్తుంది. యాడ్‌-ఆన్‌ రూపంలో బ్రౌజర్‌కి జత చేసి వాడుకోవచ్చు. * https://sapling.ai


పూర్తిగా ఉచితం.. గ్రామర్క్‌

ఓపెన్‌-సోర్స్‌ కమ్యూనిటీ నుంచి అందుబాటులోకి వచ్చింది. పూర్తి ఉచిత వెర్షన్‌గా వెబ్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లిష్‌లో కంపోజ్‌ చేసుకున్న మేటర్‌ని సైట్‌లో పోస్ట్‌ చేస్తే చాలు. క్షణాల్లో ప్రాసెస్‌ చేసి సూచనలు చేస్తుంది. * https://grammark.org


మరికొన్ని..
https://hemingwayapp.com * https://www.outwrite.com * https://writefull.com


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని