Vehicle Registration: పాత వాహనాలకు కొత్త వాత

పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది! 15 ఏళ్లు దాటిన వాహనాలపై ఛార్జీలను సుమారు ఎనిమిది రెట్లు వడ్డించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఏప్రిల్‌

Updated : 15 Mar 2022 09:17 IST

రీ-రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను భారీగా పెంచిన కేంద్రం
ఆర్సీ రెన్యువల్‌ ఆలస్యమైనా భారీ జరిమానా
నోటిఫికేషన్‌ విడుదల ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

దిల్లీ: పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది! 15 ఏళ్లు దాటిన వాహనాలపై ఛార్జీలను సుమారు ఎనిమిది రెట్లు వడ్డించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలపై ‘హరిత పన్ను’ను విధిస్తూ రూపొందించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం- 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఐదేళ్లకోసారి రెన్యువల్‌ చేయించుకోవడంతో పాటు... ఎనిమిదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా సామర్థ్య ధ్రువపత్రం తీసుకోవాలి. వ్యక్తిగత వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ ఆలస్యమైతే నెలకు రూ.300 చొప్పున, వాణిజ్య వాహనాలైతే రూ.500 చొప్పున అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతాన్ని ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించారు. అక్కడ 15 ఏళ్లు దాటిన పెట్రోలు, 10 ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాల రీ-రిజిస్ట్రేషన్లను కేంద్రం ఇప్పటికే రద్దు చేసింది. వాటిని నడపాలనుకుంటే ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చుకోవాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని