ఆర్‌బీఐ అనుమతిస్తేనే రుణం!

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసేందుకు తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మరో రూ.2 వేల కోట్ల రుణం ఇవ్వాలని ‘హడ్కో’ని కోరింది. ఈ పథకానికి ఇప్పటికే హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌

Updated : 19 May 2022 06:01 IST

‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణానికి హడ్కోని  రూ.2 వేల కోట్లు  అడిగిన రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌

రిజర్వ్‌ బ్యాంక్‌కు లేఖ రాసిన సంస్థ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసేందుకు తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మరో రూ.2 వేల కోట్ల రుణం ఇవ్వాలని ‘హడ్కో’ని కోరింది. ఈ పథకానికి ఇప్పటికే హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) రూ.8 వేల కోట్ల రుణం ఇచ్చింది. రాష్ట్రాలు కార్పొరేషన్ల పేరుతో తీసుకుంటున్న రుణాలను సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో లెక్కిస్తామని కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధన తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త అప్పు మంజూరుపై హడ్కో.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)ని సంప్రదించింది. దీంతో ఇప్పుడు ఆర్‌బీఐ స్పందన కీలకం కానుంది. హడ్కో అధికారుల్ని కలిసేందుకు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ సునీల్‌శర్మ ఈ నెల 23న దిల్లీకి వెళుతున్నారు.

బడ్జెట్‌లో రూ.11 వేల కోట్ల ప్రతిపాదన

పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,91,057 గృహాలు మంజూరు చేసింది. వీటిలో దాదాపు 15వేల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ఈఏడాది బడ్జెట్‌లో నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు సొంత జాగా ఉన్న వారికి రూ.3లక్షల సాయం కలిపి రూ.11 వేల కోట్లు ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని