కార్గో సేవలు మరింత విస్తృతం

తెలంగాణ ఆర్టీసీ నిర్వహిస్తున్న పార్సిల్, కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 25 May 2022 05:15 IST

పార్సిళ్ల పికప్‌ కోసం ఆర్టీసీ కసరత్తు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ నిర్వహిస్తున్న పార్సిల్, కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో పార్సిళ్లను ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని.. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. పార్సిళ్లను కూడా వారు కోరుకున్న ప్రాంతం నుంచే పికప్‌ చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఆర్టీసీతో కలిసి పనిచేసే వారి కోసం అన్వేషిస్తున్నామని, ఆసక్తి ఉన్న వారు splofficertsrtc@gmail.comకు ఈ-మెయిల్‌ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 27లోగా 9154197752 నంబరులో సంప్రదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని