శిథిలావస్థలో సాగర్‌ ఎడమ కాల్వ

తెలుగు రాష్ట్రాల్లోని సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ మరమ్మతులను రూ.4444 కోట్ల ప్రపంచబ్యాంకు....

Published : 28 May 2022 06:19 IST

ఈనాడు, నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లోని సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ మరమ్మతులను రూ.4444 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో 2008లో ప్రారంభించి 2017లో పూర్తి చేశారు. ఎడమ కాల్వ మరమ్మతులకు అయిదు ప్యాకేజీల్లో సుమారు రూ.1300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ మరమ్మతులు చేసిన అయిదేళ్లకే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చాలా చోట్ల కాల్వకు మళ్లీ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనుల్లో విచ్చలవిడి అవినీతి, నాణ్యత లోపంతో రూ.కోట్ల నిధులు వృథా అయ్యాయి. రెండు నెలల్లో కాల్వకు నీటి విడుదల కొనసాగనుంది. ఇప్పటికే కాల్వ గరిష్ఠ సామర్థ్యంలో సగం నీటినే వదులుతున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ప్రస్తుతం సగం మేర నీళ్లు వదిలినా చాలా చోట్ల కాల్వకు గండ్లు పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అధికారులు స్పందించి నీటి విడుదలకు ముందే కాల్వకు మరమ్మతులు చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని