నేటి నుంచి రైతుబంధు సొమ్ము

రైతుబంధు నిధులను మంగళవారం నుంచి దశలవారీగా రైతుల బ్యాంకు ఖాతాలలో వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. మొత్తం 68.10 లక్షల మంది రైతులకు చెందిన కోటి 50లక్షల 43

Published : 28 Jun 2022 05:33 IST

రూ.7,521.80 కోట్లు జమచేస్తాం: మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌ : రైతుబంధు నిధులను మంగళవారం నుంచి దశలవారీగా రైతుల బ్యాంకు ఖాతాలలో వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. మొత్తం 68.10 లక్షల మంది రైతులకు చెందిన కోటి 50లక్షల 43 వేల 606 ఎకరాలకు రూ.5 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో వ్యవసాయశాఖ సొమ్ము జమ చేస్తుందని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.7,521.80 కోట్లు విడుదల చేసిందన్నారు. మంగళవారం ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో, బుధవారం రెండు ఎకరాల వారికి, గురువారం 3 ఎకరాల వారికి...ఇలా రోజుకు ఒక్కో ఎకరా చొప్పున పెంచుతూ రైతుల ఖాతాలలో సొమ్ము జమచేస్తామని తెలిపారు. కొత్తగా భూములు కొని మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సమీప వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్‌ పాసుబుక్కు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి పేరు నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. కేంద్రం ఎన్ని ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించినా రైతుల మీద అభిమానంతో రైతుబంధు నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పత్తి, కంది, ఇతర అపరాలు, నూనెగింజల సాగుపై దృష్టిసారించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని