కార్మికుల వైద్యానికి నిధులేవి?

రాష్ట్రంలో బీమా వైద్య సేవలకు నిధులు మంజూరు చేయడం లేదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈఎస్‌ఐసీ నుంచి రూ.442 కోట్లు రావాల్సి ఉంటే, రూ.228 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. మిగిలిన నిధుల్ని వెంటనే

Published : 30 Jun 2022 06:24 IST

ఈఎస్‌ఐసీ సమావేశంలో మల్లారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీమా వైద్య సేవలకు నిధులు మంజూరు చేయడం లేదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈఎస్‌ఐసీ నుంచి రూ.442 కోట్లు రావాల్సి ఉంటే, రూ.228 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. మిగిలిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు భవనాలు గుర్తించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సెకండరీ కేర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాలకు అనుమతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఈఎస్‌ఐసీ రీజినల్‌బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని