సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వరకు జరగనున్నాయని, మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి

Published : 02 Jul 2022 04:16 IST

మాడ వీధుల్లో వాహనసేవలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వరకు జరగనున్నాయని, మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై  శుక్రవారం తిరుమలలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. ‘సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. అక్టోబరు 1న గరుడవాహన సేవ, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగుతాయి. కరోనా కారణంగా గతంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించాం. ఈసారి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపు ఉంటుంది’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని