విద్యుత్‌ చట్ట సవరణతో తీరని నష్టం

కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్‌ రంగ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు తీరని నష్టం కలుగుతుందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. ఇప్పటికే ఈ చట్ట సవరణను

Published : 14 Aug 2022 05:16 IST

ఉద్యోగులకు త్వరలో వేతన సవరణ

సీఎండీ ప్రభాకరరావు

వెంగళ్‌రావునగర్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్‌ రంగ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు తీరని నష్టం కలుగుతుందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. ఇప్పటికే ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ సీఎం తీర్మానం చేశారని పేర్కొన్నారు. సంస్థల ఉద్యోగులు, ఇంజినీర్ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వెంగళ్‌రావునగర్‌ జీటీఎస్‌ కాలనీ నుంచి కృష్ణకాంత్‌ పార్కు వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీని ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో విద్యుత్‌ ఉద్యోగులకు వేతన సవరణపై తీపికబురు చెబుతామని, పీఆర్సీ కమిటీ అధ్యయనం చేస్తోందని అన్నారు. భారీ వర్షాల వల్ల విద్యుత్‌ సంస్థలకు రూ.80 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఎన్‌పీడీసీఎల్‌లో నష్టం ఎక్కువగా ఉందని వివరించారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు, సీఈలు, ఎస్‌ఈలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని