కృష్ణా, గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం

కృష్ణా నదికి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు సోమవారం రాత్రి 7 గంటలకు 3,33,677 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో నాగార్జునసాగర్‌ 12 గేట్లను ఐదు అడుగులు, 14 గేట్లను

Updated : 16 Aug 2022 05:57 IST

శ్రీశైలం పది గేట్లు... సాగర్‌ 26 గేట్లు ఎత్తి దిగువకు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదికి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు సోమవారం రాత్రి 7 గంటలకు 3,33,677 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో నాగార్జునసాగర్‌ 12 గేట్లను ఐదు అడుగులు, 14 గేట్లను పది అడుగుల మేర ఎత్తడంతోపాటు కుడి, ఎడమ కాల్వలు, ప్రధాన విద్యుత్‌ కేంద్రం, ఎస్‌ఎల్బీసీ ద్వారా 3,38,677 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి నీటి విడుదల తగ్గినప్పటికీ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు బీమా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండటంతో దిగువకు వదులుతున్నారు. దాదాపు 90 వేల క్యూసెక్కుల బీమా ప్రవాహం జూరాల ఎగువన కృష్ణా నదిలో కలుస్తోంది. తుంగభద్ర, జూరాల నుంచి వచ్చే ప్రవాహంతో శ్రీశైలం డ్యాం వద్ద 3.94 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, మంగళవారం నాటికి మరింత పెరగనుంది. గోదావరి నదిలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లక్ష్మీ బ్యారేజీ నుంచి దిగువకు ప్రవాహం కొనసాగుతోంది.

రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యప్రదేశ్‌ పైకి వెళ్లి బలహీనపడింది. ఉత్తర-దక్షిణ భారత ప్రాంతాల నడుమ గాలులతో మరో ఉపరితల ద్రోణి కర్ణాటక నుంచి శ్రీలంక సమీపంలోని కోమరీన్‌ ప్రాంతం వరకూ వ్యాపించింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని