ఖైదీలను విడుదల చేస్తామన్నారు.. ఉత్తర్వులు మరిచారు

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వివిధ జైళ్లలోని 75 మంది ఖైదీలను విడుదల చేస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో జైళ్లలో ఏళ్లుగా మగ్గుతున్న ఖైదీల్లో ఆశలు రేగాయి. తమ వారు

Published : 16 Aug 2022 05:37 IST

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వివిధ జైళ్లలోని 75 మంది ఖైదీలను విడుదల చేస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో జైళ్లలో ఏళ్లుగా మగ్గుతున్న ఖైదీల్లో ఆశలు రేగాయి. తమ వారు పంద్రాగస్టు సందర్భంగా సోమవారం విడుదలవుతారనే ఆశతో ఖైదీల కుటుంబసభ్యులు ఆయా జైళ్ల ముందు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూశారు. రాత్రి 10.30 గంటలు దాటినా వారు కారాగారాల నుంచి బయటకు రాకపోవడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లిపోయారు.  తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ రాజేష్‌ని సంప్రదించగా.. ఖైదీల విడుదలకు  ప్రభుత్వ ఉత్తర్వులు తమకు చేరలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని