నిలిచిపోయిన పీఎఫ్‌ కార్యాలయం తరలింపు

బొగ్గు గనుల ప్రావిడెంట్‌ ఫండ్‌ (సీఎంపీఎఫ్‌) ప్రాంతీయ కార్యాలయాన్ని గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు తరలించాలన్న ప్రతిపాదనను సీఎంపీఎఫ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు తిరస్కరించారు. మంగళవారం

Published : 17 Aug 2022 05:49 IST

గోదావరిఖనిలోనే కొనసాగింపు

ఈనాడు, హైదరాబాద్‌, శ్రీరాంపూర్‌, న్యూస్‌టుడే: బొగ్గు గనుల ప్రావిడెంట్‌ ఫండ్‌ (సీఎంపీఎఫ్‌) ప్రాంతీయ కార్యాలయాన్ని గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు తరలించాలన్న ప్రతిపాదనను సీఎంపీఎఫ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు తిరస్కరించారు. మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జైన్‌ అధ్యక్షతన జరిగిన ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గోదావరిఖనిలో ఉన్న ఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించాలంటూ ఈ సమావేశంలో అజెండా అంశంగా పొందుపరిచారు. కాగా తరలించొద్దని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఇటీవల లేఖ రాశారు. మంగళవారం ఈ అంశంపై చర్చకు వచ్చిన వెంటనే సమావేశంలో సింగరేణి తరఫున హాజరైన సంచాలకుడు ఎన్‌.బలరామ్‌ మాట్లాడుతూ.. గోదావరిఖనిలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని కోరారు. కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో కార్యాలయ తరలింపును నిలిపివేయడానికి ట్రస్టీలు నిర్ణయించారు. బొగ్గు సంస్థల్లో పదవీ విరమణ పొందిన కార్మికులకు చెల్లించే పింఛన్‌ నిధి బలోపేతం కోసం ప్రతీ టన్నుపై అదనంగా రూ.5 పింఛన్‌ నిధికి జమచేయాలని తీర్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని