ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో తీపికబురు

ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడతారని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ ఆర్టీసీ కళాభవన్‌లో టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో

Published : 28 Sep 2022 04:02 IST

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడతారని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ ఆర్టీసీ కళాభవన్‌లో టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో 100 రోజుల ఛాలెంజ్‌లో భాగంగా ఎక్కువ మైలేజీ సాధించినవారు, రాఖీ పౌర్ణమిరోజు అధికాదాయం తీసుకొచ్చిన కార్మికులు, సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌ మాట్లాడుతూ  సంస్థను ప్రైవేటుపరం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నామన్నారు. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ అంకితభావంతో సిబ్బంది పనిచేస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నారు. వంద రోజుల ఛాలెంజ్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా గోవర్ధన్‌, సజ్జనార్‌లు ఈడీలు పురుషోత్తం, యాదగిరిలను సత్కరించారు. ఈ ఛాలెంజ్‌లో విజేతలుగా ఎంపికైన జ్యోతి, హరిబాబు, కేఎంరెడ్డి, జీపీ కుమార్‌, అంజయ్యలను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం  పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts