మహబూబ్‌నగర్‌-గద్వాల మార్గంలో విద్యుదీకరణ పూర్తి

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మహబూబ్‌నగర్‌-గద్వాల స్టేషన్ల మధ్య 72.7 కిమీ మార్గం విద్యుదీకరణ పూర్తయింది. 

Published : 30 Nov 2022 03:43 IST

ఏడాదిలో రికార్డు స్థాయిలో 385 కి.మీ: ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మహబూబ్‌నగర్‌-గద్వాల స్టేషన్ల మధ్య 72.7 కిమీ మార్గం విద్యుదీకరణ పూర్తయింది.  సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య కొంతకాలం క్రితమే విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. దీంతో సికింద్రాబాద్‌ నుంచి గద్వాల వరకు రైళ్లు విద్యుత్తు ఇంజిన్లతో ప్రయాణం చేయడానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో మొత్తం 385 కిలోమీటర్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని, భారతీయ రైల్వేలోని అన్ని జోన్లలో ఇదే అత్యధికమని ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యుదీకరణ పనులతో ఇంజిన్లు మార్చాల్సిన వ్యయప్రయాసలు తగ్గుతాయి. రైళ్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సగటు వేగం పెరుగుతుంది. ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని