ట్రోపెక్స్‌ విన్యాసాలు ప్రారంభం

హిందూ మహా సముద్ర ప్రాంతంలో రక్షణ, భద్రత వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ట్రోపెక్స్‌ విన్యాసాలు ఉపకరిస్తాయని నౌకాదళ వర్గాలు తెలిపాయి.

Published : 25 Jan 2023 03:57 IST

విశాఖపట్నం(సింధియా), న్యూస్‌టుడే: హిందూ మహా సముద్ర ప్రాంతంలో రక్షణ, భద్రత వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ట్రోపెక్స్‌ విన్యాసాలు ఉపకరిస్తాయని నౌకాదళ వర్గాలు తెలిపాయి. రెండేళ్లకోసారి జరిగే విన్యాసాలు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ కొనసాగుతాయని వెల్లడించాయి. విన్యాసాల్లో భారత నేవీ, ఆర్మీ, వాయుసేన, తీరగస్తీ దళాలు తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నాయి. జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, తీరగస్తీ నౌకలు హార్బర్‌, సీఫేజ్‌ల్లో దశల వారీగా సంయుక్త విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్టు వివరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని