India Post: తపాలా ఖాతా కావాలా.. సిబ్బందే ఇంటికొచ్చి తెరుస్తారు!

తపాలా కార్యాలయాలకు వెళ్లి సేవలు పొందడం కాదు.. సిబ్బందే ఇంటికొచ్చి సేవలందించనున్నారు. ఆన్‌లైన్లో సేవలపై హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని 40 పట్టణాల్లో ప్రచారాన్ని తపాలాశాఖ ప్రారంభించింది.

Updated : 19 Feb 2023 03:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: తపాలా కార్యాలయాలకు వెళ్లి సేవలు పొందడం కాదు.. సిబ్బందే ఇంటికొచ్చి సేవలందించనున్నారు. ఆన్‌లైన్లో సేవలపై హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని 40 పట్టణాల్లో ప్రచారాన్ని తపాలాశాఖ ప్రారంభించింది. ఖాతా తెరవాలనుకునే వారు ‘పోస్ట్‌ ఇన్ఫో’ (www.indiapost.gov.in) అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని.. అందులో చిరునామా, ఇతర వివరాలు నమోదు చేసి సర్వీస్‌ రిక్వెస్ట్‌ నమోదు చేయాలి. ఆ వెంటనే ఇంటికి తపాలా ఉద్యోగి వచ్చి ఖాతా తెరిచేందుకు అవసరమైన దరఖాస్తును పూరించడంలో సహకరిస్తారు. ఖాతా తెరిచాక.. పాస్‌పుస్తకం తెచ్చిస్తారు. ఈ సేవలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తపాలా పొదుపు ఖాతా ఉన్నవారు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే రికరింగ్‌ డిపాజిట్‌, టైమ్‌ డిపాజిట్‌, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలను తెరిచే వెసులుబాటూ ఉంది. మరింత సమాచారానికి టోల్‌ఫ్రీ నంబర్‌ 8002666868లో సంప్రదించొచ్చు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి నెలాఖరుకు 50 వేల నూతన ఆన్‌లైన్‌ ఖాతాలు తెరవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తపాలాశాఖ సహాయ సంచాలకులు సీహెచ్‌.రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని