Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక

ఆకతాయితనంతో రైళ్లపై రాళ్లు విసరడం వంటివి చేస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది.

Updated : 29 Mar 2023 08:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆకతాయితనంతో రైళ్లపై రాళ్లు విసరడం వంటివి చేస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేసింది. ఇటీవల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లపై రాళ్ల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీసుకున్న చర్యలపై మంగళవారం ద.మ.రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో జనవరి నుంచి ఇప్పటివరకు ఇలాంటివి 9 ఘటనలు జరిగాయని, 39 మందిని అరెస్టుచేసి జైలుకు పంపామని పేర్కొంది. ఈ దాడుల్లో అయిదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని