సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ను 8న ప్రారంభించనున్న ప్రధాని

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ రైలును ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ సికింద్రాబాద్‌లో ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 02 Apr 2023 05:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ రైలును ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ సికింద్రాబాద్‌లో ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ప్రధాని రైలును ప్రారంభించడంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.  తెలుగు రాష్ట్రాలకు  రెండో రైలు కేటాయించడంపై ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌ -తిరుపతి మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రైళ్లు 12 గంటల సమయం తీసుకుంటుంటే.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 8.30 గంటల్లో గమ్యానికి చేరుకుంటుంది.  తొలిరోజు ప్రయాణంలో నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుంది. అన్ని స్టేషన్లలో ఈ రైలుకు అపూర్వ స్వాగతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని