ఏప్రిల్‌లో జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌

వేసవి నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై రోజూ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Published : 27 Mar 2024 03:57 IST

జిల్లాల్లో తాగునీటి సరఫరాపై రోజూ సమీక్షించాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ శాంతికుమారి

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై రోజూ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలుంటే ఎప్పటికప్పుడు పరిష్కరించి నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ‘‘రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం ఉన్నా.. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నాగార్జునసాగర్‌లలో గత సంవత్సరం మాదిరిగానే నీటి మట్టాలున్నాయి. దీంతో ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఏ విధమైన ఇబ్బందుల్లేవు. ఏప్రిల్‌ రెండో వారం అనంతరం జలాశయాల నుంచి అత్యవసర పంపింగ్‌ చేపడతాం. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలకు అవసరమైన నిధులు విడుదల చేశాం. బోరుబావుల ఫ్లషింగ్‌, పైపుల మరమ్మతులు చేపట్టాలి. హైదరాబాద్‌ నగరంలోనూ సరిపడా నీటిని సరఫరా చేస్తున్నాం’’ అని సీఎస్‌ తెలిపారు. సమీక్షలో రాష్ట్ర పురపాలక, పంచాయతీరాజ్‌శాఖల ముఖ్యకార్యదర్శులు దానకిశోర్‌, సందీప్‌కుమార్‌ సుల్తానియా, పురపాలక సంచాలకురాలు దివ్య, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని