మే 1 నుంచి టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్సు

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జూన్‌ 13 వరకు టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది.

Published : 23 Apr 2024 03:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జూన్‌ 13 వరకు టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. హైదరాబాద్‌, హనుమకొండ, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో జరిగే ఈ కోర్సుకు  పదో తరగతి లేదా లోయర్‌గ్రేడ్‌ టెక్నికల్‌ కోర్సు ఉత్తీర్ణులైన 18 నుంచి 45 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు www.bse.telangana.gov.in  వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్‌ చేసుకొని వాటిని నింపి పైన పేర్కొన్న అయిదు జిల్లాల విద్యాశాఖాధికారులకు సమర్పించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని