Telangana News: ఆలోచన అదిరింది.. ‘ప్రాంగణం’ మెరిసింది
గతంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తుండేది.
గతంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తుండేది. పశువుల సంచారంతోపాటు ప్రైవేటు వాహనాలూ అక్కడే నిలిపేవారు. ప్రయాణికులు బస్టాండ్‌లోకి వచ్చేందుకే ఇష్టపడేవారు కాదు. కానీ, ఒక్కరి కృషితో ఆ ప్రాంగణం సుందరంగా మారిపోయింది. ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్న గొల్లపల్లి సాయన్న విధుల్లో భాగంగా బోథ్ బస్టాండ్ కంట్రోలర్‌గా మూడేళ్ల కిందట వచ్చారు. ప్రయాణికుల పాట్లను చూసి చలించిపోయిన ఆయన.. సోషల్ మీడియా సహకారంతో స్థానికులను చైతన్య పరిచారు. ఆర్టీసీ బోథ్ ప్రాంత ఉద్యోగులు, స్థానికుల నుంచే కాక తాను సైతం డబ్బులు వెచ్చించి.. ప్రాంగణానికి రంగులు వేయించారు. మరుగుదొడ్లను పంచాయతీ నిధులతో నిర్మించారు. దాతల తోడ్పాటుతో 76 సిమెంటు బల్లలు సమకూర్చారు. తల్లులు చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదిని సైతం నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని సాయన్న ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఈనాడు, ఆదిలాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్ కుమార్తె ఫిక్సా..?
-
Locker: బ్యాంక్ లాకర్లలో క్యాష్ పెట్టొచ్చా? బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)