వ్యాపారంలో అడుగు పెడుతున్నారా?

ఇది ఏ కాలం అంటే... అంకుర సంస్థల కాలమని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త సంస్థలు వస్తున్నాయి. ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ కలల్ని నిజం చేసుకుంటున్నవారెందరో! అందులో మహిళలూ ముందున్నారు. మీరూ అటుఅడుగులు వేయాలనుకుంటున్నారా?

Published : 17 Jun 2022 00:59 IST

ఇది ఏ కాలం అంటే... అంకుర సంస్థల కాలమని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త సంస్థలు వస్తున్నాయి. ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ కలల్ని నిజం చేసుకుంటున్నవారెందరో! అందులో మహిళలూ ముందున్నారు. మీరూ అటుఅడుగులు వేయాలనుకుంటున్నారా? అయితే, ముందు ఈ ప్రశ్నల్ని మీకు మీరు వేసుకోమంటున్నారు నిపుణులు...

1. సహ వ్యవస్థాపకులు, సలహాదారులు, మార్గనిర్దేశకులు... వీరి ఎంపిక విషయంలో స్పష్టత ఉందా? ఈ స్పష్టత ఉండటం, లేకపోవడమనేది పని విధానంలో, కంపెనీ ఎదుగుదలలో చాలా తేడా చూపిస్తుంది.

2. వినియోగదారుల, ఖాతాదారుల అవసరం, సమస్య ఏంటి? దాన్ని మీరు మిగతావారికంటే ఏ విధంగా మెరుగ్గా పరిష్కరించగలరు?

3. మార్కెట్‌లో ఉన్న అవకాశాలేమిటి? మీరు అడుగుపెట్టాలనుకుంటున్న మార్కెట్‌కి సంబంధించి అనుభవం, విషయ పరిజ్ఞానం ఉన్నాయా? మార్కెట్‌లో ట్రెండ్‌కు తగ్గ ఉత్పత్తి తెస్తున్నారా? 

4. మార్కెట్‌లో ఉన్నవారికంటే మీకున్న ప్రత్యేక, భిన్నమైన సామర్థ్యాలేమిటి?

5. సంస్థకు ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? ఎలా వస్తుంది?

6. పోటీని అధిగమించడానికి మీ స్వల్పకాల, దీర్ఘకాల వ్యూహాలేమిటి?

7. వ్యాపారం ప్రారంభం వెనక మీ ప్రధాన ఉద్దేశం ఏమిటి? విలువలు, అంతిమ లక్ష్యం.. ఇవన్నీ రాసుకున్నారా?

8. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ వీటిలో ఏ విధంగా మీ సేవలు అందుతాయి. హైబ్రిడ్‌ విధానంలో సేవలు అందించడానికి అవకాశాల గురించి ఆలోచించారా?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్