Published : 12/03/2023 00:11 IST

మహిళలే మాంసం కొట్టిస్తారక్కడ...

మాంసం ఇప్పటి ఆహార అలవాట్లలో మరీ ముఖ్యమైపోయింది. నాన్‌వెజ్‌ ప్రియులకు ముక్క లేనిదే పూట గడవదు.. ఇది తినేవారి సంగతి. ఇంట్లో రుచిగా వండిపెట్టేది మహిళలే అయినా...తెచ్చేది మగవారే. దుకాణాల్లో... మాంసం కొట్టిచ్చేది వారే. అయితే ఇప్పుడు ప్రముఖ మాంసాహార సంస్థ లీషియస్‌... ఈ సంప్రదాయాన్ని మార్చేసింది. ఉత్పత్తి, సేకరణ, నాణ్యతా, ప్యాకింగ్‌, రవాణా ప్రమాణాల్లో మహిళల పాత్ర కీలకమని గుర్తించి మగువలకే ఈ బాధ్యతలు అప్పగించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ సంస్థ సుమారు 230 మంది మహిళలకు ఈ అవకాశం కల్పించింది. కూరలు తరగడం, వండివార్చడం తెలిసిన వనితలకు ఈ మాంసం కొట్టడం ఓ లెక్కా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని