విద్యార్థినిగా.. ఉద్యోగిగా...

సోషల్‌మీడియాలో సమయాన్ని వృథా చేసే బదులు, ఆన్‌లైన్‌ పార్ట్‌ టైం జాబ్స్‌పై అవగాహన పెంచుకుంటే మంచిది. పుస్తకాలు, ఫీజులు, పాకెట్‌మనీ వంటివాటికి ఉపయోగపడేలా ఇప్పుడు ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేసే అవకాశాలు విద్యార్థులకూ.. ఉన్నాయి. పాఠ్యాంశాలు బోధించడంలో ఆసక్తి, సామర్థ్యం ఉంటే చాలు. పలు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడానికి పార్ట్‌టైం బోధనకు ఆహ్వానిస్తున్నాయి.

Published : 13 Mar 2023 00:21 IST

డిగ్రీ చేస్తున్న రమకు చదువుకుంటూనే ఏదైనా ఉద్యోగంలో కూడా చేరి కనీసం తన ఖర్చులకైనా సంపాదించుకో వాలనుకుంటుంది. విద్యనభ్యసిస్తూనే ఉద్యోగబాధ్యతలను కూడా చేపట్టొచ్చు అంటున్నారు కెరియర్‌ నిపుణులు.

సోషల్‌మీడియాలో సమయాన్ని వృథా చేసే బదులు, ఆన్‌లైన్‌ పార్ట్‌ టైం జాబ్స్‌పై అవగాహన పెంచుకుంటే మంచిది. పుస్తకాలు, ఫీజులు, పాకెట్‌మనీ వంటివాటికి ఉపయోగపడేలా ఇప్పుడు ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేసే అవకాశాలు విద్యార్థులకూ.. ఉన్నాయి. పాఠ్యాంశాలు బోధించడంలో ఆసక్తి, సామర్థ్యం ఉంటే చాలు. పలు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడానికి పార్ట్‌టైం బోధనకు ఆహ్వానిస్తున్నాయి. రెండు లేదా మూడు గంటల ఖాళీ సమయాన్ని ఆ క్లాస్‌లకు కేటాయించుకొంటూ చదువునూ కొనసాగించొచ్చు. ఆర్థిక స్వాతంత్రంతోపాటు సబ్జెక్ట్స్‌పై అవగాహన కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ అనుభవం కెరియర్‌కు ఉపయోగపడొచ్చు.  

ఫ్రీలాన్స్‌.. సామాజికపరమైన అంశాల నుంచి కథలు, కవితలు వంటివి రాసే అలవాటుంటే ఫ్రీలాన్స్‌గా పనిచేయొచ్చు. పలు పత్రికాసంస్థలు, మ్యాగజైన్స్‌ ఇప్పుడు ఫ్రీలాన్సర్స్‌ను ఆహ్వానిస్తున్నాయి. యువత ఆలోచనలు, వారి అవసరాలు, ఫ్యాషన్‌ వంటి ఎన్నో అంశాలపై అవగాహన, వాటికి అక్షరరూపాన్నివ్వగలిగే సామర్థ్యం ఉంటే చాలు. మంచి పదాలతో శైలి బాగుంటే దీన్ని అభిరుచిగా చేసుకొని ఖాళీ సమయాన్ని వినియోగించొచ్చు. మనసుకు నచ్చింది చేస్తూనే ఆదాయాన్నీ అందుకోవచ్చు.

డేటా ఎంట్రీ.. పలురకాల సంస్థలు తమ సర్వేలో భాగంగా పార్ట్‌టైం జాబ్స్‌కు అవకాశాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌ సర్వే చేసి, ఆ సమాచారాన్ని డేటా రూపంలో సదరు సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌, టైపింగ్‌వంటి పలురకాల నైపుణాలుంటే పార్ట్‌టైం జాబ్‌ను సునాయసంగా సంపాదించొచ్చు. సదరు వెబ్‌సైట్స్‌లో ఉద్యోగావకాశాలను వెతికి పట్టుకోవచ్చు.

అనువాదం.. రెండు మూడు భాషల్లో పట్టుంటే చాలు. ఆన్‌లైన్‌ లాంగ్వేజ్‌ ఆర్గనైజేషన్లు, ప్రభుత్వ ఎన్జీవోలు, మీడియా లేదా పబ్లికేషన్స్‌లో అనువాదం చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. సమయం ఉన్నప్పుడల్లా ఒప్పుకొన్న పని పూర్తిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో ఎడిటింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, అకౌంట్స్‌ వంటివాటిలో కోర్సులు చేస్తే పార్ట్‌టైం జాబ్స్‌గా చేరొచ్చు. ఇవన్నీ భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యాలను, అనుభవాలను అందిస్తాయి. ఆర్థికప్రణాళికపై అవగాహనా పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్