మిమ్మల్ని మీరు మరచిపోతున్నారా...

ఉదయం లేచిన దగ్గర నుంచే మనల్ని మనం మరచిపోవడం మొదలవుతుంది. ఇంట్లో అందర్ని లేపి నీళ్లు తాగమని గ్లాసులు, బాటిళ్లు అందిస్తాం. అప్పటికే మనం లేచి ఏ రెండు, మూడు గంటలవుతుందో.

Published : 01 Sep 2023 01:13 IST

దయం లేచిన దగ్గర నుంచే మనల్ని మనం మరచిపోవడం మొదలవుతుంది. ఇంట్లో అందర్ని లేపి నీళ్లు తాగమని గ్లాసులు, బాటిళ్లు అందిస్తాం. అప్పటికే మనం లేచి ఏ రెండు, మూడు గంటలవుతుందో. వంటావార్పుతో నీళ్ల గుటక కూడా వేయం. ఆరోగ్యం వాళ్లకేనా? మీకేమైనా పర్లేదా! లేచాకో, వాళ్లతో పాటో మీరూ నీళ్లో, పాలో తాగండి. ఇంకా..

  • అల్పాహారం తయారుచేస్తాం, వడ్డిస్తాం. చిన్నపిల్లలైతే తినిపిస్తాం కూడా. మరి మన విషయానికి వచ్చేసరికి మధ్యాహ్న భోజనం తయారు చేయాలనో, ఆఫీసుకు టైం అయిపోతుందనో తినడం మానేస్తాం. రోజంతా ఉత్తేజంగా ఉండాలంటే ఉదయం తప్పనిసరిగా టిఫిన్‌ చేయాలి. లేదంటే దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • మనం ఎక్కడ ఉన్నా సరే అందరూ సమయానికి తిన్నారో లేదో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అన్న ఆలోచనలే. ఆఫీసుల్లో ఉన్న వారైతే పని మీదకు ధ్యాసపోయి మరచిపోతారేమో కానీ, ఇంట్లో ఉన్నవాళ్లకి సగం రోజు ఇలానే గడిచిపోతుంది. ఎక్కువగా ఆలోచిస్తే ఒత్తిడి, ఆందోళన, తలనొప్పులు, పోషకాహార లోపం లాంటి సమస్యలతో బాధపడాలి. ఆలోచనలు పక్కకు నెట్టి టీవీ చూడటం, మొక్కల పెంపకం, కళలను నేర్చుకోవడం లాంటి వ్యాపకాల్లో నిమగ్నమవ్వండి. 
  • రోజంతా కష్టపడుతున్నావు. కాస్త రిలాక్స్‌ అవ్వు అని మీకెవరూ చెప్పరు. మీకు మీరే సమయాన్ని కేటాయించుకోవాలి. ఇంటి పనులు తొందరగా చేసేసుకుని ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడమో, స్నేహితుల్ని కలవడం, అమ్మనాన్నలు, అక్కచెెళ్లెళ్లూ దగ్గర్లో ఉంటే వారిని కలవడమో చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
  • ఖాళీ సమయాల్లో మీ చర్మ, కేశ సంరక్షణ మీద దృష్టి పెట్టండి. రాత్రి పడుకునే ముందో, ఉదయం లేచాకో దీనికి కాస్త సమయాన్ని కేటాయించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్