కలల్ని వదలొద్దు

పెళ్లి తర్వాత చాలామంది అమ్మాయిలు అప్పటివరకూ కన్న కలలన్నీ పక్కన పెట్టి, పిల్లలు కుటుంబం అంటూ బోలెడు బాధ్యతల్ని తీసుకోవాల్సి వస్తుంది.

Published : 06 Feb 2024 02:54 IST

పెళ్లి తర్వాత చాలామంది అమ్మాయిలు అప్పటివరకూ కన్న కలలన్నీ పక్కన పెట్టి, పిల్లలు కుటుంబం అంటూ బోలెడు బాధ్యతల్ని తీసుకోవాల్సి వస్తుంది. తీరా కొన్నాళ్లకు ఏదో కోల్పోయినట్లూ, తమ కలలన్నీ చెదిరిపోయినట్లూ కుంగిపోతుంటారు. ఈ రోజుల్లో ఆలోచించే శక్తి ఉండాలే కానీ... ఇంట్లోనే ఉండి అద్భుతాలెన్నో సాధించొచ్చు. అదెలాగంటారా?

  • ముందు మీకు ఏ అంశాల్లో ఆసక్తి ఉందో గుర్తించండి. ఆపై మీ లక్ష్యం కోసం మీరెంత సమయం, శ్రమ కేటాయించుకోగలరో వాస్తవికంగా అర్థం చేసుకోండి. ఏ పనైనా ప్రణాళికగా చేయగలిగితే... మన వల్ల కాదనే మాట కానీ, ఎవరో మనల్ని ప్రోత్సహించాలనే భావన కానీ ఉండదు.
  • సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక... విద్య, ఉపాధి అవకాశాలెన్నో అరచేతిలోకే వచ్చాయి. ఆర్థిక భరోసా కోసమే మీ తాపత్రయం అయితే మీ దారెటో స్పష్టత అవసరం. మీకు హస్తకళల్లో ప్రావీణ్యం ఉందా... ఇంకేం నాణ్యమైన పనితనానికి కచ్చితంగా గుర్తింపు ఉంటుంది. మీ కళకు అందమైన రూపాన్నివ్వండి. వాటిని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో అమ్మకానికి ఉంచడమో లేదంటే ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో ప్రదర్శించడమో చేయండి. ఆదరణ దొరికితే క్రమంగా ఆదాయాన్నీ అందుకోవచ్చు. అదీ లేదంటే పెయింటింగ్‌ వేయడమో, సంగీతంలో ప్రవేశమో ఉంటే ఇంటి దగ్గరే తరగతులు చెప్పండి. కొత్త ఉత్సాహం వస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్