‘థాంక్యూ గాడ్‌’

‘అద్దంలో నన్ను నేను చూసుకొనే ప్రతిసారీ దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంటా. నన్నిలా అద్భుతంగా సృష్టించినందుకు అతడికి ప్రశంసలు అందించాలి’... ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉన్న ‘థాంక్యూ గాడ్‌’ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated : 17 May 2024 14:02 IST

‘అద్దంలో నన్ను నేను చూసుకొనే ప్రతిసారీ దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంటా. నన్నిలా అద్భుతంగా సృష్టించినందుకు అతడికి ప్రశంసలు అందించాలి’... ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉన్న ‘థాంక్యూ గాడ్‌’ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతేనా... ప్రముఖులు, నటీనటులన్న తేడా లేకుండా అన్ని రంగాలవారూ ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఆ వీడియోను సామాజికమాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీంతో ఈ పాటకు వీక్షకుల సంఖ్యే కాదు... స్పందించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇంతకీ ఈ పాట పాడిందెవరో కాదు. మన భారతీయ పాప్‌ గాయని 26 ఏళ్ల ధ్వని భానుశాలీ.

ధ్వని ముంబయిలో పుట్టింది. తండ్రి వినోద్‌ భానుశాలీ టి-సిరీస్‌ గ్లోబల్‌ మార్కెటింగ్‌, మీడియా పబ్లిషింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉండేవారు. ఆ తర్వాత సొంతంగా స్టూడియోను ప్రారంభించారు. దీంతో ధ్వనికి చిన్నప్పటి నుంచి సంగీతం, నాట్యంపై ఆసక్తి. ముంబయి విశ్వవిద్యాలయంలో కామర్స్‌లో డిగ్రీ, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌లో బీఎమ్‌ఈ పూర్తి చేసిందీమె. ఓవైపు చదువూ, మరోవైపు గాయనిగా అవకాశాలూ అందుకోగలిగింది. 2017లో నేపథ్యగాయనిగా ‘వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌’తో చలనచిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అలాగే 2018 నుంచి మ్యూజిక్‌ వీడియోల్లోనూ తన ప్రతిభ చాటింది. హిందీలో చేసిన ఈమె మొదటి వీడియో ‘ఇషారే తేరే’ను 24 గంటల్లోపే కోటిన్నరమంది చూశారు. 2019లో ధ్వని పాడిన ‘వాస్‌తే’ను యూట్యూబ్‌లో 150 కోట్ల మంది వీక్షించారు. స్వల్పవ్యవధిలో కోటి వీక్షణలను అందుకున్న అతి పిన్న గాయనిగా రికార్డునీ సాధించిందీమె. యూట్యూబ్‌లో 210 వీడియోలను అప్‌లోడ్‌ చేసి, 34 లక్షలమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. ఇక, వీక్షకుల సంఖ్యా కోట్లలోనే. గతనెలలో విడుదలైన ‘థాంక్యూ గాడ్‌’ పాట వైరల్‌ అయ్యింది. ‘నా పాటకు ఇంత క్రేజ్‌ రావటం చాలా సంతోషంగా ఉంది. గాలిలో తేలుతున్నట్లుందం’టూ మురిసిపోతోంది ధ్వని.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్