ఆరోగ్యానికి అరటి దువ్వలు!

అరటిచెట్టు కాండం మధ్యలో లేతగా ఉండే దువ్వ చాలా మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇందులోని పీచు, పొటాషియం, విటమిన్ల వంటివి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు.

Published : 31 May 2021 00:17 IST

అరటిచెట్టు కాండం మధ్యలో లేతగా ఉండే దువ్వ చాలా మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇందులోని పీచు, పొటాషియం, విటమిన్ల వంటివి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు.
జీర్ణశక్తికి..: అరటి దువ్వ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటికి పంపుతుంది. దీన్లోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చిన్న పిల్లలు, గర్భిణుల్లో జీర్ణాశయ సమస్యలను దూరం చేస్తుంది. ఎసిడిటీని దరిచేరనివ్వదు.
మూత్రాశయానికి.. : శరీరానికి తగినంత నీటిని అందించనప్పుడు మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే అరటిదువ్వతో చేసిన కప్పు రసానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగితే మంచిది. మూత్రాశయంలో రాళ్ల సమస్య రాకుండా, యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.
అధికబరువు : పీచు అధికంగా ఉండే దీన్ని కనీసం వారానికి రెండు మూడు సార్లన్నా తీసుకుంటే చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేస్తుంది. అతితక్కువ కెలొరీలతో ఉండే అరటి దువ్వ అధిక బరువుకు దూరంగా ఉంచుతుంది.
కొలెస్ట్రాల్‌, రక్తపోటును : దువ్వలో విటమిన్‌ బీ6, అధికశాతంలో ఉండే ఐరన్‌ రక్తంలోని హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతాయి. ఇందులో ఉండే పొటాషియం అధిక కొలెస్ట్రాల్‌, రక్తపోటును నియంత్రిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్