చర్మానికి తేమ కావాలి...

చర్మం తేమగా ఉండటం చాలా అవసరం. మాయిశ్చరైజర్ల వల్ల చర్మానికి కాంతి వస్తుంది. పొడిబారడం, మచ్చలు, ముడతలు లాంటి సమస్యలు తలెత్తవు. ఎండ పొడ పడనివాళ్లు నూనె ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది మేకప్‌కు ప్రొటెక్టివ్‌ బేస్‌గానూ ఉపయోగపడుతుంది. అలాగని దీన్ని అతిగా వాడితే పులిపిరులు...

Published : 22 Jun 2021 01:19 IST

చిన్న చిన్న జాగ్రత్తలతో చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

ర్మం తేమగా ఉండటం చాలా అవసరం. మాయిశ్చరైజర్ల వల్ల చర్మానికి కాంతి వస్తుంది. పొడిబారడం, మచ్చలు, ముడతలు లాంటి సమస్యలు తలెత్తవు. ఎండ పొడ పడనివాళ్లు నూనె ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది మేకప్‌కు ప్రొటెక్టివ్‌ బేస్‌గానూ ఉపయోగపడుతుంది. అలాగని దీన్ని అతిగా వాడితే పులిపిరులు, మొటిమలు వచ్చే అవకాశం ఉంది. చర్మం తాజాగా ఉండాలంటే తేమ కావాలి. అందుగ్గానూ రోజంతా నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లొచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పేరుకున్న రసాయనాలు, మురికి, మృతకణాలు పోతాయి.

బయటకు వెళ్లినా లేకున్నా రోజూ రెండుసార్లు ముఖం కడుక్కోవడం మంచిది. తర్వాత పొడిచర్మమయితే ఆలివ్‌ నూనె రాయండి. జిడ్డు చర్మమయితే జెల్‌ వాడండి. సాధారణ లేదా పొడి చర్మానికి పెరుగులో కలిపిన కీరాదోస రసం, జిడ్డు చర్మానికి గుడ్డు తెల్లసొనలో చెంచా తేనె, నాలుగు చుక్కలు నిమ్మరసం కలిపి పెడుతుంటే తేటదనం వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్