పనస ప్రయోజనాలెన్నో!

బంగారు రంగులో మెరిసిపోయే పనస తొనలు రుచినే కాదు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. కాలానుగుణంగా వచ్చే ఈ పండును తీసుకుంటే కలిగే లాభాలేంటో చూద్దామా...

Published : 23 Jun 2021 01:13 IST


బంగారు రంగులో మెరిసిపోయే పనస తొనలు రుచినే కాదు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. కాలానుగుణంగా వచ్చే ఈ పండును తీసుకుంటే కలిగే లాభాలేంటో చూద్దామా...

పనసలో ఫోలేట్‌, నియాసిన్‌, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌ లాంటి ఖనిజాలు ఉంటాయి.
*ఈ పండులోని పీచు జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేసి మలబద్ధకాన్నీ దూరం చేస్తుంది.
* కెలొరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
* ఈ పండులో పొటాషియం అధిక మొత్తంలో ఉండి రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్‌ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
* దీనిలో వ్యాధినిరోధకతను పెంచే విటమిన్‌-సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంతోపాటు చర్మ నిగారింపునకూ తోడ్పడుతుంది.
* దీంట్లోని ఇనుము రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
పనస గింజల్లో బోలెడు పోషకాలుంటాయి. పనస గింజలను కాల్చుకుని తింటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్