China: పాకిస్థాన్‌ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి చైనా సహకారం

అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా.. పాకిస్థాన్‌తో అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే దిశగా పలు ప్రణాళికలను చైనా ప్రకటించింది.

Published : 29 Jan 2022 16:42 IST

బీజింగ్: అంతరిక్ష కేంద్రం అభివృద్ధి, మరికొన్ని ఉపగ్రహాల ప్రయోగం సహా.. పాకిస్థాన్‌తో అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేసే దిశగా పలు ప్రణాళికలను చైనా ప్రకటించింది. సమాచార ఉపగ్రహాల అభివృద్ధిలో పాకిస్థాన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. ఆ దేశ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి తోడ్పాటు ఇవ్వనున్నట్లు శ్వేతపత్రంలో ప్రకటించింది. ప్రస్తుతం చైనా సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ ఏడాదిలోనే అది పూర్తి కానున్నట్టు పేర్కొంది. 2018లో పాకిస్థాన్ ప్రయోగించిన రెండు ఉపగ్రహాలకు తోడ్పాటు అందించిన చైనా.. అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష శాస్త్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 2019లో పాక్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైనా తెలిపింది. వాటితోపాటు వెనిజువెలా, సుడాన్, అల్జీరియన్ ఉపగ్రహాలనూ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. మరోవైపు సౌదీ అరేబియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, లక్జెంబర్గ్ దేశాలు చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలకు సైతం సహకారం అందించనున్నట్లు పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు