Ukraine: యుద్ధంతో ఆహార భద్రత కరవు..: యూఎన్‌ ఎఫ్‌ఏవో ఆందోళన

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆహార భద్రత కరవు అవుతోందని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) నివేదిక వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టిన నాటి నుంచి

Published : 09 Jun 2022 17:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఆహార భద్రత కరవు అవుతోందని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టిన నాటి నుంచి ఈ సంస్థ ఇచ్చిన తొలి నివేదిక ఇదే. యుద్ధం కారణంగా నల్ల సముద్ర మార్గం మూతపడటంతో బలహీన దేశాలు ఆహారం కోసం భారీ ఖర్చు చేయాల్సి వస్తోందని ఈ నివేదికలో వెల్లడించింది.  ప్రపంచ గోధుమల్లో మూడోవంతు రష్యా, ఉక్రెయిన్‌ పండిస్తాయి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధికంగా ఎరువులు సరఫరా చేసే దేశాల్లో రష్యా ముందుంటుంది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల దిగుమతి ఖర్చు  1.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఈ నివేదిక అంచనావేసింది. దిగుమతులు, ధరలు రెండూ దీనికి కారణమవుతాయని పేర్కొంది. ఫలితంగా అల్పదాయా దేశాల్లోని రైతులు రష్యా ఎరువులను కొనగలిగే స్థితి లేదని అంచనావేసింది. రష్యా వెంటనే బ్లాక్‌సీ నౌకాశ్రయాలను తెరవాలని ఐరాస కోరాలని పేర్కొంది . 

మరో పక్క రష్యా మాత్రం ఉక్రెయిన్‌ నుంచి విదేశాలకు ధాన్యం ఎగుమతులను అడ్డుకోబోమని ప్రకటించింది. ఇటీవల తుర్కియే (టర్కీ) పర్యటనకు వెళ్లిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌.. అంకారాలో తుర్కియే విదేశాంగ మంత్రి మెవ్లుత్‌ కావుసొగ్లుతో చర్చల్లో ఈ మేరకు హామీ ఇచ్చారు. అయితే- ఇందుకుగాను ఆయన ఓ షరతు విధించారు. ఉక్రెయిన్‌ భూభాగం నుంచి నల్ల సముద్రం వరకు ధాన్యం చేరుకునే మార్గాల్లో మందుపాతరలను తొలగించి సురక్షిత రవాణా మార్గాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని